జగిత్యాలకు మంజూరైన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్

జగిత్యాలకు మంజూరైన యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హర్షం

జగిత్యాల, నిర్దేశం:
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు పట్ల జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్న సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..జగిత్యాల జిల్లా కేంద్రం ఎడ్యుకేషన్ హబ్ గా మారిందని విద్య అభివృధి కి తన వంతుగా కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే అన్నారు.
గత ప్రభుత్వంలో పూర్తయిన నర్సింగ్ కళాశాలను ప్రారంభించడానికి కృషి చేయటం జరిగిందని తెలిపారు.
2018 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కోరి మెడికల్ కాలేజి సైతం సాధించుకున్నామని చెప్పారు.
మెడికల్ కాలేజి నిధుల మంజూరుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ ని వారి కార్యాలయం లో కలిసి నిధుల మంజూరుకు కృషి చేయాలని కోరగా వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.
రాయికల్ మండలంలో కస్తూర్బా పాఠశాలకు 4 కోట్లతో నూతన భవనం మంజూరు అయిందని అన్నారు.
బీర్ పూర్ మండలానికి కస్తూర్బా పాఠశాల మంజూరు కాగా తుంగురు గ్రామంలో అద్దె భవనంలో ప్రారంభించ బోతున్నం అన్నారు.జగిత్యాల నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ లు మంజూరు చేయటం జరిగిందని,
5 కోట్ల తో అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా
టిఆర్ నగర్ లో ఏర్పాటు చేస్తున్నామని పనులు జరుగుతున్నాయిని అన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్ లో ప్రభుత్వం ఏర్పడగానే అమ్మ ఆదర్శ పాఠశాలలు మౌలిక సదుపాయాలకు నిదులు మంజూరు చేశారని గుర్తు చేశారు.
న్యూ హై స్కూల్ లో 10 లక్షలతో మౌలిక సదుపాయాలకు జిల్లా కలెక్టర్  నిధులు మంజూరు చేశారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం లో రెసిడెన్షియల్ పాఠశాలలు బీసీ,ఎస్సీ, మైనార్టీ అద్దె భవనంలో ఉండగా చాలా ఇబ్బందిగా ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి  అన్ని జిల్లా లో నూతన భవనాలు మంజూరు చేశారని,200 కోట్ల తో జగిత్యాల చల్ గల్ వాలంతరీ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని బడ్జెట్ సైతం విడుదల చేయటం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.జగిత్యాల నియోజకవర్గం లో విద్య అభివృధి కోసం ఎల్లప్పుడూ తన వంతుగా కృషి చేస్తామని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆన్నారు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »