మహేందర్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో మహిళ మృతి
చేవెళ్ల, నిర్దేశం :
చేవెళ్ల మండలం పరిధిలోని పట్నం మహేందర్ రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కొసం వచ్చిన మమత మృతి చెందింది. మృతురాలి సొంత గ్రామం వికారాబాద్ జిల్లా పూడూరు మండల అంగడి చిట్టెంపల్లి గ్రామం. మమత కి వేసిన ఇంజక్షన్ వికటించడం తో మృతి చెందింది అని బంధువుల ఆరోపణ. వైద్యురాలు కండిషన్ బాగాలేదని తెలుసుకొని డాక్టర్ల దగ్గర ఉండి మెహదీపట్నం ప్రీమియర్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్టుగా వైద్యులు తెలియజేశారు.