బీసీ సింహం వర్సెస్ రెడ్డి సామ్రాజ్యం!
తారాస్థాయికి ‘పవర్ స్ట్రగుల్’ పొలిటిక్స్..
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను దెబ్బకు సీఎం రేవంత్ కుట్ర..
మహేశ్‌కు బీసీల మద్దతు.. తొలగిస్తే పార్టీకి భారీ నష్టం!*
బిగ్ టీవీలో మహేశ్‌పై ‘క్యారెక్టర్ అసాసినేషన్’.. వెనక రేవంత్?*
భగీరత్ ‘రేప్’ కేసు.. రేవంత్‌పై అధిష్టానం సీరియస్!

(యాటకర్ల మల్లేష్)
కుక్కను చంపాలంటే దానికి ఎర్లు లేసినయాని ప్రచారం చేయాలి.. ఇదిగో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలలో ఇదే జరుగుతుంది. ప్రభుత్వంలో సీఎం – పార్టీలో పీసీసీ చీఫ్ ఇద్దరూ పెద్దలే.. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వాళ్లిద్దరూ సమన్వయంతో ప్రభుత్వాన్ని, పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.. కానీ.. వాళ్లిద్దరి మధ్య విభేదాలు వస్తే..? న్యాయం వైపు నిలబడిన వారి వైపే అధిష్టానం నిలబడుతుంది. సోషల్ మీడియా డామినేట్ చేస్తున్న నేటి కాలంలో ప్రతి ఆంశం హల్ చల్ అవుతుంది.
తెలంగాణ కాంగ్రెస్‌లో భూకంపం మొదలైంది. ఒకవైపు బీసీల ‘ఆత్మగౌరవ’ నినాదం, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధికార భీమం. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను టార్గెట్ చేసి రెడ్డి వర్గం జరుపుతున్న ‘బిగ్ టీవీ’ ఆపరేషన్‌తో పార్టీలో పొలిటికల్ వార్ కొనసాగుతోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా బిగ్ టీవీలో వచ్చిన కథనాల వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికే నష్టం అనేది విశ్లేషకుల వాదాన. ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి – పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ల మధ్య దూరం పెరుగడానికి కారణం రాబోయే కాలంలో బీసీ వాదం బలపడటమే.. పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్‌ను తప్పించి రెడ్డి వర్గానికి చెందిన తన అనుచరులను పెట్టుకోవడానికి రెడ్డి వర్గం కుట్ర చేసి బిగ్ టీవీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు వ్యతిరేకంగా లేనివి ఉన్నట్లు కట్టు కథలు కల్పించి ప్రసారం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
“రాబోయే ఎన్నికల్లో బీసీ సీఎం” – మహేశ్ బాంబు, రెడ్డిలు షాక్!*
సీఎం రేవంత్ రెడ్డి మీడియా చీట్ ఛాట్ లో మాట్లాడుతూ 2034 వరకు ముఖ్యమంత్రిని నేనే అంటూ బహిరంగంగా ప్రకటించడం పాత కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడని విషయం. అతని వ్యవహరశైళి సైతం రాబోయే కాలంలో బీజీపీలోకి వెళ్లి సీఎం అవుతారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాకుండా ఏడాది క్రితం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ సభలో బాంబు పేల్చారు. “రాబోయే ఎన్నికల తర్వాత బీసీ బిడ్డ సీఎం కుర్చీలో కూర్చుంటాడు” అని స్పష్టంగా ప్రకటించడంతో కాంగ్రెస్‌లో రెడ్డి లాబీలు ఉలిక్కిపడ్డాయి. రెడ్డిలు ఆధిపత్యం ఉన్న పార్టీలో ఈ వ్యాఖ్యలు జీర్ణించుకోలేకపోయాయి. ఇది కేవలం ఒక ప్రకటన కాదు.. భవిష్యత్ పవర్ ఎక్వేషన్‌లో బీసీలు చేస్తున్న తీవ్రమైన హెచ్చరిక.
బిగ్ టీవీలో మహేశ్‌పై ‘క్యారెక్టర్ అసాసినేషన్’.. వెనక రేవంత్?*

ఇటీవల బిగ్ టీవీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫెయిల్యూర్ అనే కథనాలు విరుచుకుపడ్డాయి. కానీ పార్టీ వర్గాలు చెబుతున్నది ఏమిటంటే.. ఈ కథనాల వెనుక సీఎం రేవంత్ రెడ్డి హ్యాండ్ ఉందని. మహేశ్ కుమార్ గౌడ్‌ను దెబ్బతీసి, అధిష్టానం ముందు ఆయన క్రెడిబిలిటీని ధ్వంసం చేయాలనే వ్యూహం పని చేస్తోందని సోషల్ మీడియా గుసగుసలు. అయితే. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ఉద్వేశ్యపూర్వకంగా ప్రసారం చేసారని ఆ కథనాల వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికే నష్టం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
అయితే మహేశ్ కుమార్ గౌడ్ రాముడు మంచి బాలుడిలా అందరినీ కలుపుకొని పోయే నాయకుడు. వివాదాలకు అతీతంగా పని చేస్తున్న నమ్మిన బంటు. గ్రామ పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కాంగ్రెస్ వర్గీయులు గెలిశారని క్రెడిట్ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌లకే దక్కింది.
భగీరత్ ‘రేప్’ కేసు.. రేవంత్‌పై అధిష్టానం సీరియస్!
ఈ యుద్ధానికి నిజమైన కారణం కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరత్ మైనర్ బాలిక రేప్ కేసు అని తెలుస్తోంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బతిన్నట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధిష్టానానికి నివేదిక పంపినట్లు సీఎం భావించి బిగ్ టీవీలో కథనాలు ఇప్పించినట్లు సోషల్ మీడియాలో గుసగుసలు వనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కాషాయ శిబిరం వైపు మొగ్గుచూపుతున్నారనే అనుమానాలు అధిష్టానం వర్గంలో బలపడుతున్నాయి. ఢిల్లీలో రేవంత్‌కు ఇప్పటి వరకు ఉన్న ప్రాధాన్యత తగ్గడం, కేరళ విజయం వంటి అంశాలు కూడా ఈ ఉద్రిక్తతకు తోడయ్యాయి.
మహేశ్‌కు బీసీల మద్దతు.. తొలగిస్తే పార్టీకి భారీ నష్టం!*
ఇప్పటికే బీసీ నేతలు మహేశ్ కుమార్ గౌడ్‌కు మద్దతుగా పత్రికా ప్రకటనలు ఇచ్చి సంకేతాలు పంపారు. పీసీసీ చీఫ్‌ను తొలగిస్తే బీసీలు కాంగ్రెస్ నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది రేవంత్ రెడ్డికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరిగే పరిస్థితి.
తాజా టాక్:
రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే.. ఈ యుద్ధం కేవలం వ్యక్తుల మధ్య కాదు. తెలంగాణలో రెడ్డి-బీసీ పవర్ షిఫ్టింగ్ యుద్ధం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదు కదా.. అధిష్టానం ఏ మూల్యాంకనం చేస్తుందో అనేది కీలకం. ఈ రాజకీయ డ్రామా ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీట్ అవుతున్నాయి!

Leave a Reply