ప్రియురాలి కుటుంబం వేధింపులతో యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్, నిర్ధేశం :
తాను ప్రేమించిన అమ్మాయి కుటింబికుల టార్చర్ భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఖలన్దర్ నగర్ లో చోటుచేసుకుంది.
ఖలన్దర్ నగర్ కు చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ చాంద్రాయణగుట్ట కు చెందిన ఓ అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు ఈ విషయం అమ్మాయి తండ్రి మొహమ్మద్ అబిడ్ అలీ కి తేలవడంతో గత 3 రోజుల క్రిందట ఇమ్రాన్ ఇంటికి వచ్చి మాట్లాడి పెండ్లి విషయం పై చర్చిద్దాం అని వెళ్ళిపోయాడు. నిన్నటి రోజున చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ లో ఇమ్రాన్ తన అమ్మాయిని వేధిస్తున్నాడు అని అమ్మాయితో ఫిర్యాదు చేయించి పోలీస్ స్టేషన్ కు ఇమ్రాన్ ను పిలిపించారు, చాంద్రాయణగుట్ట పోలీసులు కౌన్సెలింగ్ చేసి ఇమ్రాన్ ను ఇంటికి పంపించారు. మనస్తాపానికి గురైన ఇమ్రాన్ ఇంటికి వచ్చి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి కారణం తాను ప్రేమిచిన అమ్మాయి కుటింబికులు, ముఖ్యముగా అమ్మాయి తండ్రి మొహమ్మద్ అబిడ్ అలీ ప్రధాన కారకుడు అని వారి పై చర్యలు చేపట్టాలని పోలీసులకు కోరుతూ తన ఆత్మహత్య నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సంతోష్ నగర్ పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.