నిర్దేశం, హైదరాబాద్: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల గురించి చర్చించినప్పుడు ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి. అయితే, ఈ రోజు మీకు ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళ గురించి చెప్పబోతున్నాం. ఆమె సంపద ఎంత అంటే.. భారతదేశం మొత్తం ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లకు చేరువలో ఉంది. అయితే భారతదేశం లాంటి నాలుగు ఆర్థిక వ్యవస్థలైతే ఆమె సంపదకు సమానం. టాంగ్ రాజవంశానికి చెందిన ప్రసిద్ధ ఎంప్రెస్ వూ జెటియన్ సంపద ఇది.
వూ జెటియన్ కు 16 ట్రిలియన్ డాలర్ల సంపద
వూ జెటియాన్ చరిత్రలో అత్యంత సంపన్న మహిళగా తన పేరును నమోదు చేసుకుంది. ఆమె సంపద సుమారు 16 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఆమె సంపద నేటి బిలియనీర్‌ల సంపదను అధిగమించడమే కాకుండా చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన ఆర్థిక వారసత్వాలలో ఒకటిగా నిలిచింది. చరిత్రలో అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందడమే కాకుండా.. మోసాలు చేయడం, వ్యూహాలను రచనలు, క్రూరమైన పనులు చేసిన మహిళగా కూడా చెప్పుకుంటారు. వాస్తవామినికి ఆమె ఒక మంచి పని చేశారు. రైతులపై పన్నులు తగ్గించారు. దీంతో వ్యవసాయోత్పత్తి పెరిగి రాష్ట్ర ఆదాయం కూడా పెరిగింది.
కూతుర్ని, కొడుకులను చిధిమేసి అధికారం
ఆమె అధికారంలోకి రావడానికి ఏకంగా తన కుమార్తెనే చంపేసింది. తన కొడుకులను రాజు పదవి నుంచి తొలగించి అధికారం సంపాదించింది. అనంతరం, 690 నుంచి 705 వరకు 15 సంవత్సరాల పాలించి, చైనా సామ్రాజ్య అభివృద్ధి చేసింది. ఆమె షాంగ్జీ ప్రావిన్స్‌లోని కలప వ్యాపారి కుటుంబంలో క్రీ.శ.624లో జన్మించారు. తైజాంగ్ చక్రవర్తిని వివాహం చేసుకున్నారు.
వూ జెటియన్ మహిళా చైనాకు చెందిన మొదటి అలాగే ఏకైక మహిళా పాలకురాలు. ఆమె బాగా చదువుకున్న, దూరదృష్టి, ప్రతిభావంతులైన వక్త. ఆమె పాలనలో అపారమైన సంపద సృష్టించడంతోపాటు అనేక సంక్షేమ విధానాలను అమలు చేసి ప్రజాదరణ పొందారు. ఆమె విధానాల వల్ల వ్యాపారం పెరిగింది. పన్నులను తగ్గించడం, సిల్క్ రోడ్‌ను తిరిగి తెరవడం లాంటి పనులతో వ్యాపారానికి కొత్త మార్గాలను తెరిచి, చైనాలో కొత్త అభివృద్ధిని చూపించారు వూ.