తేడా కొడితే అన్‭ ఫాలో లేదంటే బ్లాక్.. ఇంతకీ ఈ పద్దతి సరైనదేనా?

నిర్దేశం, హైదరాబాద్: ఆ మధ్య అల్లు అర్జున్ ను ఆలియా భట్ ను ఇన్స్టాగ్రామ్ అన్ ఫాలో కొట్టింది. అలాగే విరాట్ కోహ్లీ ఆ మధ్య తన ఫేవరెట్ సింగర్ ను ఇన్స్టాగ్రామ్ లో అన్ ఫాలో కొట్టారు. ఫలానా హీరోయిన్ ఏకంగా తన భర్తనే అన్ ఫాలో చేసింది. ఇంకో ఇద్దరు మ్యూచువల్ గా అన్ ఫాలో చేసుకున్నారు. ఈ తరహా వార్తలు తరుచూ కనిపిస్తుంటాయి. నిజానికి ఇవి ట్రెండింగ్ లో ఉంటాయి. ఏ ఇద్దరి మధ్యన తేడాలొచ్చినా.. ఆన్ ఫొలో చేసుకోవడం, నంబర్లు డిలీట్ చేసుకోవడం, బ్లాక్ చేసుకోవడం.. లాంటివి సహజంగా చూస్తుంటాం. అయితే.. ఇలాంటి చర్యలు సరైనవేనా అనేది ఒక ఆసక్తికరమైన చర్చ.

ఆఫ్ లైన్లో స్నేహంగా ఉన్నా ఆన్ లైన్ లో దాన్ని చూపించకపోతే… కోపతాపాలు పెంచుకునే రోజులు ఇవి. ఇలా జరిగినప్పుడు స్టేటస్ లు సరిగా చూడటం లేదని అవతలి వారి కాంటాక్ట్ నంబరును డిలీట్ చేసేయడం, మన స్టేటస్ చూడటం లేదు కాబట్టి వారి స్టేటస్ ను మ్యూట్లో పెట్టేయడం, వీలైతే వారి స్టేటస్ చూడకుండా నెగ్లెట్ చేయడం.. ఇలాంటివి అందరూ చేస్తున్నవే. 15 సంవత్సరాల కిందటి వరకూ మనుషుల మధ్యన ఇలాంటి గొడవల్లేవు. అయితే ఇప్పుడు ఇదో సామాజిక సమస్య.

ఆఫీసులో మనం ట్రై చేస్తున్న అమ్మాయి మన వాట్సాప్ మెసేజ్ కు సరిగా రిప్లై ఇవ్వకపోతే వెంటనే తన కాంటాక్ట్స్ డిలీట్ చేయడం తమ మగతనానికి నిదర్శంగా భావించే మగవారితో పాటు.. అబ్బాయిల స్టేటస్ చూడకుండా అతడిపై తమకు ఏ ఆసక్తి లేదని చెప్పాలనుకునే అమ్మాయిలూ ఉన్నారు. ఆఫ్ లైన్ లో సాన్నిహిత్యం ఉన్న వారి మధ్యన కూడా ఇప్పుడు సోషల్ సాన్నిహిత్యంలో తేడాలు ఒచ్చేస్తాయి. ఆఫ్ లైన్ లో తేడాలొచ్చాయంటే అవి ఆన్ లైన్ లో చూపడం అలవాటుగా మారింది.

ఇది సోషల్ మీడియా యుగం. ఇప్పుడు తమ మనోభావాలన్నీ సోషల్ మీడియాలోనే పంచుకుంటున్నారు. మన ఫొటోకు ఎవరు లైకులు కొట్టారు.. మన ఫోటోలకు ఎవరు కామెంట్లు పెడుతున్నారు.. ఎవరు మన ఫొటోలను చూసి కూడా పట్టించుకోవడం లేదని మొదలుపెడితే, పది ఫొటోలు రైలు పెట్టెల్లా పెడితే ఎంతమంది వాటిని మొత్తం చూస్తున్నారు.. ఎవరు చూసీ చూడనట్టుగా ఉన్నారు.. ఎవరు సగంలో ఆపేస్తున్నారు.. ఎపరు ఆన్ లైన్ లో వచ్చి కూడా మన స్టేటస్ చూడటం లేదు.. ఇవన్నీ సదరు వ్యక్తల విషయంలో మన భావోద్వేగాలను కంట్రోల్ చేసే విషయాలు అయిపోయాయి.

అయితే ఇవన్నీ చిన్న పిల్లల చేష్టలే. ఎంత పెద్ద వయసు వాడైనా ఇలాంటి చేస్తే అది నిజంగా చిన్న పిల్లల చేష్టే. ఒక మనిషిది ఒక నెంబరే నేను సేవ్ చేసుకుంటా రెండో సంబర్ సేవ్ చేసుకోను అనేంత చాదస్తం పనికిరాదు. మన దేశంలో అయితే రెండో నంబర్ ను సేవ్ చేసుకుంటే అవతలి వాడికి తను చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేస్తున్నట్టుగా భావించేంత మూర్ఖపు మనస్తత్వం ఉంది. ఈ స్టేటస్ లు చూడటం చూడకపోవడం, చూస్తే ఒక ఉద్దేశాన్ని ఆపాదించేసుకోవడం, చూడకపోతే మహా ఉద్దేశాన్ని ఆపాదించుకోవడం ఇవన్నీ కూడా చాదస్తపు తాలూకు లక్షణాలే. దృడమైన మనస్తత్వం ఉన్నవారెవరూ ఇలా నంబర్లను డిలీట్ చేయడం కానీ, అన్ ఫాలో చేసుకోవడం కానీ, స్టేటస్ సమరాలు సాగించడం వంటివి చేయరు. ఆ మాత్రం మెచ్యూరిటీ లేకపోతేనే ఇలాంటివి వస్తుంటాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »