Take a fresh look at your lifestyle.

ఫాస్ట్ ట్యాగ్ కు బై బై.. జాతీయ రహదారులపై కొత్త టెక్నాలజీ

తొందరలోనే దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీనికి సంబంధించి ఎన్హెచ్ఏఐ అధికారికంగా తాజాగా ప్రకటన విడుదల చేసింది.

0 121

నిర్దేశం, న్యూఢిల్లీ: జాతీయ రహదారులపై టోల్ టాక్స్ విధానం రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్న డైరెక్టు పేమెంట్ చెక్ పెట్టి ఫాస్ట్ ట్యాగ్ ను తప్పనిసరి చేశారు. నేడు దానికి కూడా చెక్ పెట్టి జీఐఎస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పని చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. తొలుత 100 టోల్ ప్లాజాల్లో దీనిని ప్రవేశ పెడుతున్నారు. ఏమైనా సవరణలు ఉంటే చేసి, తొందరలోనే దేశ వ్యాప్తంగా ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ఎన్హెచ్ఏఐ హెల్ప్‌లైన్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ టోల్ ప్లాజాలు ఎంపిక చేస్తారు. ఈ సాంకేతికతతో లైవ్ మానిటరింగ్ సిస్టమ్ రియల్ టైమ్‌లో రద్దీకి సంబంధించిన హెచ్చరికలను ఇస్తుంది. అలాగే టోల్ ప్లాజా వద్ద వాహనాల క్యూలు నిర్దేశించిన పరిమితిని మించి ఉంటే లేన్ సర్దుబాట్‌లను సిఫారసు చేస్తుంది. మరిన్ని టోల్ ప్లాజాలను కవర్ చేయడానికి పర్యవేక్షణకు అనువుగా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ ఎలా పని చేస్తుంది?
ఈ సాఫ్ట్‌వేర్ ప్రతి టోల్ ప్లాజా పేరు, స్థానం, క్యూ పొడవు వేచి ఉండే సమయం, వాహనం వేగంతో సహా అనేక ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. దీనితో పాటు రద్దీ హెచ్చరికను కూడా జారీ చేస్తుంది. అధిక రద్దీ ఉంటే దారులను మార్చమని సూచిస్తుంది. జీఐఎస్ సాఫ్ట్‌వేర్ తో ఎన్హెచ్ఏఐ ట్రాఫిక్ రద్దీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు నివేదికలను పొందగలుగుతుంది. ఇది మాత్రమే కాకుండా, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, స్థానిక పండుగల గురించి కూడా ఈ సాఫ్ట్‌వేర్ సమాచారం అందిస్తుంది. దీనితో ఎన్హెచ్ఏఐ అధికారులు ట్రాఫిక్‌ను నిర్వహించడానికి, టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి మెరుగైన ప్రణాళికలను రూపొందించుకోగలరు.

టోల్ ప్లాజా కోసం పెద్ద సాంకేతిక చొరవ
ఈ వ్యవస్థ ట్రాఫిక్ పరిస్థితిని విశ్లేషించడంలో సహాయపడుతుంది. దీంతో గంట, రోజువారీ, వారం, నెలవారీగా ట్రాఫిక్‌ రద్దీకి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు దాని అతిపెద్ద సాంకేతిక చొరవలో, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని 100 టోల్ ప్లాజాలలో జీఐఎస్-ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను అమలు చేసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking