అపరేషన్ కగార్ పేరిట నరమేధం
మావోయిస్టులను హత్యలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
– ప్రజాసంఘాల ఐక్యవేదిక
నిర్దేశం, కడప :
దేశంలోని బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీల మీద నరమేధాన్నీ కొనసాగిస్తున్నదని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు.కడప ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవి శంకర్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ గోపాల్, వరుహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, రాయలసీమ కార్మిక సమాఖ్య నాయకులు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను హత్యగావిస్తుందని ఆరోపించారు. ముఖ్యంగా మావోయిస్టుల అణిచివేత పేరుతో అన్యం పుణ్యమెరగని అడవి బిడ్డలపై తీవ్రమైన అంచవేతకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల నుంచి ఆదివాసీలను, వాళ్లకు అండగా ఉన్న మావోయిస్టులను తరిమేయడం ద్వారా అడవులను బడా కార్పోరేట్లకు అప్పగించాలన్న కుట్ర దాగి ఉందని తెలిపారు. లక్షల కోట్ల విలువైన సహజమైన ఖనిజ సంపాదను, ప్రకృతి సంపదని కార్పోరేట్ కంపెనీలకి దోచిపెట్టడానికి ఈ హత్యాకాండని ప్రభుత్వం చేపట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ఆయా రాష్ట్రాల్లోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించడం విచారకరమన్నారు. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో చర్చలు చేయమంటున్న కేంద్ర ప్రభుత్వం అదే ఆయుధాలు పట్టుకున్న ఆర్ఎస్ఎస్ కనులలో పని చేస్తుందని ధ్వజమెత్తారు. ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగదళ్ బహిరంగంగా నడివీధుల్లో మారణాయుధాలతో బయోత్పాతాలు సృష్టిస్తుంటే ఒక్క కేసు లేదన్నారు. ఆర్ఎస్ఎస్ కి రాజ్యాంగం మీద నమ్మకం లేదని తీవ్రంగా విమర్శలు చేశారు. అందుకనే ఆర్ఎస్ఎస్ దేశానికి స్వాతంత్రం రాలేదని, జాతీయ జెండాను ఎగరేసేది లేదని, రాజ్యాంగాన్ని అంగీకరించేది లేదని బిస్మించుకొని ఇన్నాళ్లు ఉన్నదన్నారు. అదే ఆర్ఎస్ఎస్ కనుసనల్లో పనిచేస్తున్న బిజెపి ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతుందని తెలిపారు. ఒకవైపు మావోయిస్టు లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం ప్రజల పట్ల గౌరవం లేకపోవడమే అన్నారు. ఆయుధాలు వదిలేస్తే చర్చలు అనడం అవివేకం అన్నారు. తక్షణమే ఆపరేషన్ ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీలపై నరిమేధాన్ని నిలిపివేయాలని, మావోయిస్టులని హత్యల ద్వారా నిర్మూలించడం రాజ్యాంగ, చట్టబద్ధం కాదని తెలిపారు. విదేశీ శత్రుమూకలను నిర్మూలించడం కోసం వాడవలసిన సైన్యాన్ని దేశ పౌరుల పైన, ముఖ్యంగా ఆదివాసీలపై ఉపయోగించడం రాజ్యాంగ చట్ట వ్యతిరేకమే కాకుండా నైతికంగా దిగజారుడు చర్యని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.