ఖురాన్ ను అవమానిస్తే మరణశిక్ష వేయడమనేది సుద్ధ అబద్ధం
ఖురాన్‌ను అవమానించినందుకు జీవిత ఖైదు విధించే నిబంధన ఉంది. ప్రవక్త కుటుంబ సభ్యులపై దుర్భాషలాడితే ఏడేళ్ల వరకు శిక్ష
నిర్దేశం, హైదరాబాద్: ముస్లిం మతసమూ హాలు ఇస్లామిక్ చట్టాన్ని వక్రీకరించి ప్రజల ముందుంచుతున్నాయని పాకిస్థాన్‌కు చెందిన ఓ ఇస్లామిక్ పండితుడు ఆరోపించారు. మరణ ఫత్వా జారీ చేయడం షరియాకు విరుద్ధమని, చట్టవిరుద్ధమని ఆయన అన్నారు. ఇస్లామిక్ చట్టంలో పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అవమానించినందుకు మరణశిక్ష గురించి ప్రస్తావించలేదని, అయితే మతపరమైన అంశాలు దైవదూషణకు పాల్పడినట్లు అనుమానించిన వారిని శిక్షించవచ్చని ఉందని కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ చైర్మన్ డాక్టర్ రగీబ్ హుస్సేన్ నయీమి ఆగస్టు 29న పేర్కొన్నారు. చంపడం ఇస్లాం విరుద్ధమే కాకుండా దేశ చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు.
పాకిస్తాన్ లీడింగ్ మీడియా ది డాన్ నివేదిక ప్రకారం.. డాక్టర్ రాగీబ్ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ.. దైవదూషణ చట్టానికి సంబంధించి నాలుగు వేర్వేరు శిక్షలు విధించబడ్డాయి. ఖురాన్, ప్రవక్త కుటుంబ, అతని సహచరులను అవమానించినందుకు ఈ శిక్షలు విధించారు.
ఖురాన్‌ను అవమానించినందుకు శిక్ష ఏమిటి?
ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్‌ను అవమానించినందుకు జీవిత ఖైదు విధించే నిబంధన ఉందని, ప్రవక్త కుటుంబ సభ్యులు, సహచరులపై ఎవరైనా దుర్భాషలాడితే ఏడేళ్ల వరకు శిక్ష విధించవచ్చని డాక్టర్ నైమి చెప్పారు.
ఇస్లామిక్ చట్టంలో ఏ నేరానికి మరణశిక్ష విధించబడింది?
ఎవరైనా ఇస్లాం మత ప్రవక్తలను దూషించినా ఇస్లామిక్ చట్టం ప్రకారం మరణశిక్ష విధిస్తారని డాక్టర్ నయీమి తెలిపారు. అయితే నాలుగు నేరాలకు ఒకే ఒక్క శిక్ష ఉందని, అదే మరణమని మత సంఘాలు విశ్వసిస్తాయని ఆయన అన్నారు. దైవ దూషణకు సంబంధించి ఎవరికైనా మరణ ఫత్వా జారీ చేసే హక్కు ఎవరికీ లేదని డాక్టర్ నయీమి అన్నారు. మతతత్వ సంఘాలు రాజకీయ ప్రయోజనాల కోసం భావోద్వేగాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు.
తన అనుభవం నుంచి డాక్టర్ నయీమీ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా మరణ ఫత్వా జారీ చేయడం సరైంది కాదని ప్రకటించినప్పుడు, తనకు 500 కంటే ఎక్కువ బెదిరింపులు వచ్చాయని చెప్పారు. వీటిలో చాలా వరకు చాలా దుర్మార్గమైన పద జాలంతో దుర్భాషలాడారు. ఒకరిని చంపాలని ఫత్వా జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధం, అలాగే షరియాకు విరుద్ధమని ఆయన అన్నారు.