కుంభమేళా లో చార్జింగ్ తో లక్షల ఆదాయం
లక్నో, నిర్దేశం:
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరుగుతున్న విషయం తెలిసిందే. 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ మేళాకు భక్తులు కోట్ల సంఖ్యలో పొటెత్తుతున్నారు. కుంభ మేళాలో పాల్గొని పవిత్రమైన తివ్రేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇంకా చాలా మంది భక్తులు దేశ నలుమూలల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా కోట్ల మంది కుంభ మేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్‌కు పయనమవుతున్నారు. కుంభ మేళాకు ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో చాలా మంది చిరు ఉద్యోగులకు మంచి ఆదాయం కూడా సమకూరుతుంది. అంతమందికి అవసరమైన భోజనం, ఇతర చిన్న చిన్న అవసరాలను తీరుస్తూ, సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ కొన్ని వందల మంది మంచి ఆదాయం అందుకుంటున్నారు. ఇప్పటికే ప్రయాగ్ రాజ్ చుట్టుపక్కల వాళ్లు కుంభ్ నగర్‌లో ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకున్నారు.అయితే ఓ కుర్రాడు మాత్రం చాలా డిఫెరెంట్‌గా ఆలోచించి.. ఫోన్ ఛార్జింగ్ బిజినెస్ పెట్టాడు. ఈ కాలంలో ఫోన్ లేని వాళ్లు ఎవరున్నారు చెప్పండి. అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చాలా మంది భక్తులు ఫోన్‌లో ఛార్జింగ్ కోసం ఈ కుర్రాడి చుట్టూ గుమ్మిగూడుతున్నారు. ఒక్క ఫోన్‌కు గంట సేపు ఛార్జింగ్ పెట్టినందుకు రూ.50 తీసుకుంటున్నాడు. అలా ఓకేసారి ఓ 25 ఫోన్లకు ఛార్జింగ్ పెట్టేలా సాకెట్‌లు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత కాదన్న గంటకు వెయ్యి రుపాయాల పైనే సంపాదిస్తున్నాడు. రోజులో కనీసం 12 గంటల పాటు ఈ బిజినెస్ నడిపిస్తూ రెండు చేతులా ఇన్‌కమ్ పొందుతున్నాడు. ఈ మొబైల్ ఛార్జింగ్ బిజినెస్ ఐడియా సూపర్ అంటూ నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. @malaram_yadav_alampur01 అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అది క్షణాల్లో వైరల్‌గా మారింది. కుంభ మేళా పుణ్యమా అని ఈ కుర్రాడు మంచి ఆదాయం పొందుతున్నాడు.