జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ ల వర్గపోరు
– పీసీసీకి నివేదిస్తా
– ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
నిర్దేశం, జగిత్యాలః
మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గ పోరు పై ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 120 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కుటుంబ సభ్యులకే బేధాభిప్రాయాలు ఉంటాయి. మీడియా ఎదుట మాట్లాడుకునే అవకాశం ఇద్దరు నేతలు ఇవ్వద్దు. రేపు హైదరాబాద్ వెళ్లి పీసీసీ దృష్టికి తాజాగా జరిగిన పరిణామాలను తీసుకెళ్లి సమస్యను పరిష్కారం అయ్యేలా చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. పదేళ్ల రాచరిక పాలనను అంతముందించి ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తల పోరాట ఫలితమే. ఇద్దరి మధ్య సమన్వయం కల్పించేందుకు పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ కు నివేదిస్తా. మీడియా కసంయమనం పాటించాలి. గోరంతను కోండత చేయవద్దని కోరుతున్నానని అన్నారు. పదవుల కోసం ఫాం హౌజ్ లో కేటీఆర్, హరీష్ రావు తన్నుకున్నారు . వంద ఏళ్ల కాంగ్రెస్ పార్టీ లో స్వేఛ్చ, స్వాతంత్రం ఎక్కువగా ఉంది. తాజా పరిణామాలను హై కమాండ్ కు నివేదిస్తానని అన్నారు.