పేలనున్న పొంగులేటి బాంబ్.. రేపోమాపో కేసీఆర్, హరీష్ అరెస్ట్?

– కాళేశ్వరంపై కార్నర్ అయిన మామా-అల్లుడు
– విచారణలో కీలక విషయాలు వెల్లడించిన మాజీ ఈఎన్సీ
– తన అరెస్ట్ కు ప్రతీకారం తీర్చుకునే పనిలో సీఎం రేవంత్

నిర్దేశం, హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఊరిస్తున్న బాంబ్ పేలే సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. దీపావళి బాంబుల కంటే పొలిటికల్ బాంబ్ పేల్చేందుకు అంతా సిద్ధమవుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, ఈ ఎపిసోడ్ లో మొదట అరెస్టయ్యేది మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆరేనని తెలుస్తోంది. ఆయనతో పాటు హరీష్ రావు కూడా అరెస్ట్ కానున్నారంటూ ప్రచారం జోరు మీదుంది. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కీలక విషయాలు వెలుగు చూస్తున్న క్రమంలో.. కేసీఆర్, హరీష్ రావులకు దాదాపుగా పీలక మీద వకు ఉచ్చు బిగిసినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో అరెస్ట్ లు జరగనున్నట్లు సమాచారం.

అంతా కేసీఆరే చేశారు…!

గతంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్ట్ నిర్మాణాలకు కావాల్సిన స్థానాలపై నిర్ణయం తీసుకున్నట్లు రామగుండం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు చెప్పారు. కాగా వ్యాప్కోస్ తయారు చేసిన కాళేశ్వరం డీపీఆర్ ను ప్రభుత్వం ఆమోదించిందని, ఆనాడు సీఎంగా కేసీఆర్ అనుమతి ఇస్తూ సంతకం చేశారని విచారణ కమిషన్ ఎదుట చెప్పారు. నిర్మాణం చేపట్టే క్రమంలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను కేసీఆరే మార్చమన్నట్లు తెలిపారు. ఇక, కాళేశ్వరంలో కేసీఆర్ తర్వాత పెద్ద చేయి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావుది. ఇద్దరూ కుటుంబ సభ్యులే కావడంతో.. గుట్టుచప్పుడు కాకుండా ఇది జరిగిందని భోగట్టా.

లక్ష్యంతో కాకపోయినా కక్షతోనైనా..

రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవేంటని.. ప్రజాస్వామ్యంలో కూడా దాన్ని అద్భుతంగా అప్లై చేస్తున్నారు మన నాయకులు. అవినీతి, అక్రమాలను చూపించి విపక్ష నేతల్ని అరెస్ట్ చేయడం, రాజకీయంగా వారిని వేధించడం సర్వసాధారణమే. అలా అని ఏ నాయకుడూ నీతిమంతంగా పాలన చేయడం లేదు. ఏ అరెస్టూ నిష్పాక్షికంగా జరగడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగైనా దోచుకోవాలన్నట్లే గులాబీ పార్టీ వ్యవహరించింది. ప్రజలకేదో కీడు చేశారని ఇప్పుడు కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారంటే ఉప్పులో కాలేసినట్లే. గతంలో తనను అరెస్ట్ చేయించిన ఉదంతంపై రేవంత్ కు పగ ఉంటుంది. టైం చూసి కక్ష తీర్చుకోవడమే తరువాయి.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »