నిర్దేశం, అమరావతిః హోంమంత్రి అనిత.. వైసీపీ అధినేతను మాస్ ర్యాగింగ్ చేశారు. మీరా మాట్లాడేది.. తిరుమల వెంకన్న గురించి.. మీరు తిరుమల విశిష్టతను పట్టించుకోలేదు, సాంప్రదాయాలను గౌరవించలేదు, స్వామివారిపై ఎలాంటి భక్తి లేదు, ఇలా హోంమంత్రి అనిత ఎన్నో మాటలు అన్నారు. నాట్ ఓన్లీ హోంమంత్రి.. ప్రస్తుతం కూటమి నేతలంతా ఇదే విషయంపై జగన్‌ను చీల్చి చెండాడుతున్నారు. నిజానికి ఇది జగన్‌కు మాస్టర్ స్ట్రోక్.. నిజానికి తిరుమలకు కనుక జగన్ వెళ్లి సినిమా మరోలా ఉండేది. కానీ ఆయనకే వచ్చిందో లేక.. ఆయన సలహాదారుల సంఘం తీసుకున్న నిర్ణయమో తెలీదు కానీ.. ఆయన తిరుమల పర్యటనను రద్దు చేసుకొని ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. పోనీ ప్రెస్‌మీట్‌తో అయినా పెద్దగా ఏమైనా సాధించారా? అంటే.. నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానంటూ మరింత ఇరుక్కున్నారు.
2019కు ముందు ఇలాంటి వ్యూహాలు రచించేందుకు కేరాఫ్‌గా ఉండేవారు జగన్. అప్పుడు అధికారపక్షంలో ఉన్న చంద్రబాబును హోదా కావొచ్చు.. నిధుల సేకరణ కావొచ్చు. ఇలా అనేక అంశాలపై నిలదీసి అడుగుతూ.. ఏకంగా ఎన్డీయే నుంచి బయటికి వచ్చేలా చేశారు జగన్. మరి అలాంటి జగన్ ఇప్పుడు సేమ్ అలాంటి వ్యూహానికే బాధితుడిగా మారినట్టు కనిపిస్తోంది. కూటమి నేతలు చేసిన ఆరోపణలు, విమర్శలను కడుక్కునే పనిలో బీజీగా ఉన్నారు. నిజానికి ఆయనను ఆ పరిస్థితికి తీసుకొచ్చింది కూటమి నేతలే అని చెప్పాలి.
నిజానికి జగన్ తిరుమలకు వెళ్లి ఉంటే.. ఇప్పుడు చర్చ వేరే దానిపై నడిచేది. కూటమి నేతలు డిఫెన్స్‌లో పడిపోయేవారు. అఫ్‌కోర్స్ విమర్శలు వచ్చేవి.. కానీ ఈ రేంజ్‌లో ఉండేవి కావు. ఇప్పుడు ఆయనకు శ్రీవారిని దర్శించుకోవడమే ఇంట్రెస్ట్ లేదు అనే స్టైల్‌లో జరుగుతుంది ప్రచారం. మరి ఈ విషయాల నుంచి ఆయనేలా గట్టెక్కుతారో చూడాలి. ఇప్పుడు ఒకవేళ ఆయన శ్రీవారిని దర్శించుకున్నా, తమ విమర్శల వల్లే దర్శించుకున్నాడు కానీ, స్వామి వారిపై భక్తితో కాదని కూటమి నేతలు చెప్పేస్తారు.
కూటమి నేతలు వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని.. ప్రసాదాలు కల్తీ చేశారంటూ తప్పుడు ఆరోపణలు వైసీపీ నేతలు చేస్తున్నారంటున్నారు. అంతేకాదు ఇప్పుడు పంచాయితీ అంతా బ్లేమ్ గేమ్, డిక్లరేషన్ల చుట్టే నడుస్తోంది. అయితే ఈ విషయం అయినా ఎక్కువ కాలం లైమ్‌లైట్‌లో ఉండదు. ఇది ముగిసేలోపు మరో అస్త్రంగా సిద్దంగా ఉన్నట్టు కనిపిస్తోంది అధికార పక్ష తీరును చూస్తుంటే.. ఎందుకంటే తిరుమల వ్యవహారంలో రిపోర్ట్ వచ్చిన రెండు నెలల తర్వాత సరైన సమయంలో బయటపెట్టారు. మరి అలాంటి రిపోర్టులు లేదా వివాదాలు ఇప్పటికే సిద్ధం చేసి.. సరైన సమయం కోసం వెయిట్ చూస్తున్నట్టు ఉన్నారు. మరి జగన్ దీనికి ప్రిపేర్ ఉన్నారా? లేదా? అనేది త్వరలోనే తెలుస్తుంది.