అలా అయితే సినిమాను పబ్లిక్ లోకి తీసుకురాకు నాగవంశీ
నిర్దేశం, స్పెషల్ డెస్క్ః
మనం ఒక ప్రాడక్ట్ తయారు చేసినప్పుడు ఎవరో వచ్చి అది చాలా చెత్తగా ఉందంటే ఎవరికైనా కోపమే వస్తుంది. అలా అని నా వస్తువులు కొంటే కొనడం, లేకపోతే మానేయండి అంటే కుదరదు. సినిమాలకు కూడా ఇది వర్తిస్తుంది. మ్యాడ్ స్క్వేర్ సినిమా మీద సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ మీద ఆ చిత్ర బృందానికి కోపం రావడం తప్పేమీ కాదు. కానీ, పబ్లిక్ లైఫ్ లో ఉన్నవారికి కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచింది. లేదంటే బతుకు రాంగోపాల్ వర్మలా తయారు అవుతుంది. ఒకప్పుడు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపేసిన రాంగోపాల్ వర్మ ఇలాంటి తిక్క ఏషాలకు పోయి తన గుడ్ విల్ మొత్తం కోల్పోయాడు. అప్పుడప్పుడు కాస్త జనరంజకమైన సినిమాలే తీసినా.. తిక్కలోడి సినిమారా ఏం చూస్తాలేం అనుకుని అటువైపు వెళ్లడమే మానేశారు.
సినిమా రంగమనేది వ్యాపారం. అదేమీ దేశ సేవ కాదు, సమాజోద్దరణా అంత కన్న కాదు. సినిమా కథలేమీ వ్యక్తిత్వ వికాస కావ్యాలు కావు, దేశభక్తి గీతాలు కాదు. పచ్చిగా చెప్పాలంటే.. సినిమా తిక్కొల్లంతా కలిసి వారికి నచ్చిన కథేదో రాసుకుని, నచ్చినట్లు తీసుకుని జనాల మీదకు రుద్దుతారు. జనాలకు నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. మ్యాడ్ నచ్చింది. నవ్వించింది కాబట్టి చూశారు. ఒకవేళ మ్యాడ్ స్క్వేర్ నచ్చితే చూస్తారు. రివ్యూలను, క్రిటిక్ లను పెద్దగా పట్టించుకోరు. నాగవంశీ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. బాహుబలి, పుష్ప సినిమాల మీద క్రిటిక్స్ వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చాయి. కానీ, ప్రజలు ఆ సినిమాల్ని ఆదరించారు.
అసలు తన సినిమా గురించి నెగిటీవే మాట్లాడొద్దని నాగవంశీ తెగ ఊగిపోతున్నారు. అలాంటప్పుడు సినిమాను పబ్లిక్ లోకి తేవడం దేనికి? ఇంట్లో ఒక్కడే హాయిగా చూస్తూ చప్పట్లు కొడుతూ, విజిల్స్ వేసుకోవచ్చు. నాగవంశీ సినిమా ద్వారా తన అభిప్రాయాలు చెప్పినప్పుడు, క్రిటిక్స్ కూడా వారి అభిప్రాయాలు చెప్తారు. ప్రతి చెత్త సినిమాని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారనుకుందాం. అయితే వచ్చిన నష్టమేంటట. డిజిటల్ యుగంలో ఇలాంటి క్రిటిక్స్ సినిమాని ఆపలేవు. ఒక వేళ క్రిటిక్స్ అంత డ్యామేజ్ చేస్తాయనుకుంటే పవన్ కల్యాణ్, మహేష్ బాబు లాంటి బడా హీరోల మీద ప్రతి రోజూ ట్రోల్స్ వస్తాయి. అంత మాత్రాన వారి స్టార్ డం తగ్గుతుందా?
వ్యాపారంలో అనేక సవాళ్లు ఉంటాయి. పోటీ ఉంటుంది. ఎదుటి వారు టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తారు. అయినా సరే.. నిలదొక్కుకోవాలి. మన బ్రాండ్ ని నిలబెట్టుకోవాలి. అంతే కానీ, ఇష్టముంటే రండీ, లేకపోతే దొబ్బేయండి అంటే.. రెప్యూటేషన్ దిబ్బతిని సంకనాకిపోవాల్సి వస్తుంది. మీడియా ముందు నాగవంశీ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. తానేదో దేశోద్దారకుడన్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు. తన సినిమాను ప్రజలు ఫ్రీగా చూపించడం లేదు కదా. అదేదో ప్రభుత్వ ఆసుపత్రి పెట్టి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు ఎందుకా చిందులు? లాభాలు తగ్గుయన్న ఫ్రస్టేషన్. తానేదో ఆకాషం మీద నుంచి ఊడిపడ్డట్ట ఫీలింగ్. ఈ రెండు వదులుకోక పోతే సినీ రంగంలో ఎంతో మంది అస్తమించినట్టుగానే నాగవంశీకి తప్పదు.