పేదల కోసం కష్ట పడ్డాడు… క‌రీంన‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్సీ బ‌రిలో నిలిచాడు.. యాటకారి సాయ‌న్న‌

పేదల కోసం కష్ట పడ్డాడు…
క‌రీంన‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్సీ బ‌రిలో నిలిచాడు..
– కష్టాల్లో ఉన్నోళ్లను ఆదుకునే యాటకారి సాయ‌న్న‌
– కరొనా కాలంలో ప్రాణాలకు ఎదురొడ్డి సాయం
– ఎసీసీ మాస్టర్ గా స్టూడెంట్స్ కు క్రమ శిక్షణ
– ఉపాధ్యాయుడిగా ఎప్పుడూ ఇతరులకు సహాయమే..
– మానవత్వం చాటుకున్న సాయన్నకు జేజేలు అంటున్న ఉపాధ్యాయులు..

( నిర్దేశం, స్పెషల్ డెస్క్ )

ఎన్ సీసీ మాస్టర్ యాటకారి సాయన్న స్టైలే వేరు. వృత్తి రిత్యా ఆయన ఉపాధ్యాయుడు కానీ.. కష్టాలలో ఉన్నోళ్ల కన్నీళ్లు తుడువడమే ఆయన ప్రవృత్తి.. ఉపాధ్యాయుడిగా విద్యార్థులను తీర్చిదిద్దుతునే ఉపాధ్యాయులకు జరిగే అన్యాయాలపై ముందుండి పోరాడారు. అందరి నోట్లో నానే యాటకారి సాయన్న ఇప్పుడు క‌రీంన‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్సీ బ‌రిలో నిలిచి అగ్రవర్ణాలతో ఢీ అంటే ఢీ అంటూ ముందుకు కదులుతున్నారు.
—–


అడిగితే కానీ అమ్మైనా పెట్ట‌దు అంటారు. కానీ, సాయ‌న్న అలా కాదు. ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డ అవ‌స‌రం ఉన్నా.. వెంట‌నే అక్క‌డికి చేరుకుని స‌హాయం అందిస్తుంటారు. వృత్తి రిత్యా ఉపాధ్యాయుడిగా విద్యాబుద్ధులు నేర్ప‌డం. అయితే వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న మాన‌వ‌తా దృక్ప‌థం చాలా ఎక్కువ‌. చేసేది చిన్న ఉద్యోగ‌మైనా, మ‌న‌సు మాత్రం చాలా పెద్ద‌ది. ఆయ‌న పేరు యాట‌కారి సాయ‌న్న‌. పేరుకు త‌గ్గ‌ట్టుగానే మ‌న‌స్థ‌త్వం కూడా స‌హాయం చేయ‌డ‌మే. తీసుకునే జీతానికి, బ‌తికే జీవితానికి ప‌రిపూర్ణ‌త సాయ‌న్న‌. నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాల్లో సాయ‌న్న పేరు తెలియ‌నివారు ఉండ‌రు. అందులో కొంత‌ మంది ప్ర‌త్య‌క్షంగా ఆయ‌న‌తో ప‌రిచ‌యం ఉన్న‌వారు. చాలా మంది ఆయ‌న గురించి విన్న‌వారు.

టీచ‌ర్ ఎమ్మెల్సీ బ‌రిలో సాయ‌న్న‌

క‌రీంన‌గ‌ర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెద‌క్ ఉమ్మడి జిల్లాల టీచ‌ర్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ నుంచి బ‌రిలో నిలిచారు సాయ‌న్న‌. 30 ఏళ్లుగా చ‌దువు చెప్పిన సాయ‌న్న‌కు శిక్ష‌ణ నేర్ప‌డ‌మే కాదు, క్ర‌మ‌శిక్ష‌ణ నేర్ప‌డంలోనూ చాలా సీనియారిటీ ఉంది. ఎందుకంటే ఆయ‌న అసోసియేట్ ఎన్సీసీ అధికారి కూడా. స‌హ‌జంగానే సాయ‌న్న‌కు ప్ర‌జ‌ల‌తో క‌లిసిపోయే మ‌న‌స్థ‌త్వం. త‌న చుట్టూ ఉన్న‌వారు ఏదైనా ఇబ్బందిలో ఉన్నారంటే త‌న‌కు చేత‌నైన స‌హాయం చేసే అంకిత‌భావం. బ‌హుశా.. అదే సాయ‌న్న‌ను రాజ‌కీయాల వైపుకు మ‌ళ్లించింది. ఒక టీచ‌ర్ గా త‌న శ‌క్తి స‌రిపోవ‌డం లేద‌ని, రాజ‌కీయంగా చ‌ట్ట స‌భ వ‌ర‌కు ప్ర‌భుత్వంతో కొట్లాడి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న‌ది త‌న ఆశ‌య‌మ‌ని సాయ‌న్న చెబుతున్నారు.

కరొనా, తెలంగాణ ఉద్య‌మాల్లో ఘ‌నాపాటి

తెలంగాణ ఉద్య‌మ‌పోరాటంలో అత్యంత చురుగ్గా పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో రాష్ట్ర జేఏసీ నిర్మ‌ల్ క‌న్విన‌ర్ గా ప‌ని చేశారు. కాలికి చ‌క్రాలు క‌ట్టుకుని తెలంగాణ ఆవిర్భావ అవ‌స‌రాన్ని అర్థ‌వంతంగా చెప్పేవారు. ఆయ‌న తెలుగు పండితులు క‌నుక‌.. ప్ర‌జ‌ల యాస‌లో సులువుగా వివ‌రించేవారు. ఇది నిర్మ‌ల్ ప్ర‌జ‌ల్లో తెలంగాణ భావ‌న త్వ‌రిత‌గ‌తిన పెర‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది. తెలంగాణ కోసం లాఠీ దెబ్బ‌లు తిని 40 రోజులు ఆస్ప‌త్రి పాల‌య్యారు. ఇక క‌రొనా పోరాటంలోనూ సాయ‌న్న స‌హాయం ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేరు. ప్ర‌జ‌ల‌కు పౌష్టికాహారం అందించే ద‌గ్గ‌రి నుంచి, అత్యంత క్లిష్ట స‌మ‌యాల్లో వారికి అండ‌గా ఉండేవారు. క‌రొనా వ‌ల్ల ఎవ‌రైనా చ‌నిపోతే.. ఆయ‌నే స్వ‌యంగా ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హించేవారు.

సామాజిక పోరాటాలు

93 కులాల ఐక్య‌త‌తో ఏర్పాటైన బీసీ ఐక్య‌వేదిక రాష్ట్ర నాయ‌కుడిగా ఉన్నారు. ఉద్యోగ సంఘ నాయ‌కుడిగా, ముదిరాజ్ సేవా స‌మితి రాష్ట్ర నాయ‌కుడిగా, తెలంగాణ బీసీ మ‌హాస‌భ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు. స్వ‌త‌హాగా బీసీ (ముదిరాజ్) అయిన సాయ‌న్న‌.. వెనుక‌బ‌డిన వ‌ర్గాల చైత‌న్యం కోసం అహర్నిశ‌లు ప‌ని చేస్తుంటారు. సామాజిక అభ్యున్న‌తి చ‌దువు అవ‌స‌రాన్ని ప్ర‌తి సంద‌ర్భంలో చెప్తుంటారు. వెనుక‌బ‌డిన కులాలను అభివృద్ధి ప‌థంలోకి తీసుకువెళ్లేందుకు విస్తృత స‌మూహంలో ప‌ని చేస్తుంటారు.

బాంసెఫ్ లో నిర్మ‌ల్ క‌న్విన‌ర్ గా

వెనుక‌బ‌డిన కులాలు, మైనారిటీ ఉద్యోగుల సంఘ‌మైన బాంసెఫ్ (బీఏఎంసీఈఎఫ్)లో సుదీర్ఘ కాలంగా ప‌ని చేస్తున్నారు సాయ‌న్న‌. బ‌హుజ‌న నాయ‌కుడు కాన్షీరాం ప్రారంభించిన ఈ సంస్థ‌లో ప‌ని చేయ‌డం అంటే.. స‌మాజం కోసం ఎంతో చేయ‌డం. వెనుక‌బ‌డిన కులాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థ దేశంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఏకైక సంస్థ‌. అతి పెద్ద సంస్థ‌. ఈ సంస్థ నుంచి ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తూ వ‌చ్చారు సాయ‌న్న‌. ఇప్పుడు ఈ సంస్థ రాజ‌కీయ విభాగ‌మైన బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ నుంచి రాజ‌కీయ రంగంలోకి దిగారు. క‌రీంన‌గ‌ర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెద‌క్ ఉమ్మడి జిల్లాల టీచ‌ర్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా సాయన్న త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

క‌రీంన‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్సీ బ‌రిలో నిలిచిన యాటకారి సాయన్న ఎమ్మెల్సీగా గెలువాలని ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు ఆయన శ్రేయోభిలాషులు.

Nirdhesham Whatsapp Channel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Hot Topics

Related Articles

Translate »