నిర్దేశం, ముంబై: యానిమల్ సినిమా నటుడు సిద్దాంత్ కర్ణిక్ తెలిసే ఉంటుంది. 2004లో టీవీ షో రీమిక్స్ తో కర్ణిక్ తన కెరీర్‌ను ఆరంభించి ప్రస్తుతం స్టార్ సెలబ్రిటీగా పాన్ ఇండియా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ నటుడికి కెరీర్ ప్రారంభంలో ఒక చేధు అనుభవం ఎదురైందట. చేధు అంటే అలా ఇలా కాదు.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు సహా మహిళా నటులు ఎదుర్కొనే క్యాస్టింగ్ కౌచ్ అనుభవం. అవునండీ బాబు.. హీరో సిద్దాంత్ తన అనుభవాన్ని చెప్తే తెలిసింది మగవారికి కూడా ఈ ఇబ్బందులు తప్పవని.
ఓ ఇంటర్వ్యూలో సిద్ధాంత్ మాట్లాడుతూ.. ‘‘నేను కూడా ఓ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాను. 22 ఏళ్ళ వయసులో నేను నా కెరీర్ ప్రారంభించాను. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్ని కలిశాను. నా పోర్ట్ఫోలియో తీసుకొని రాత్రి 10:30 గంటలకు ఇంటికి రమ్మని పిలిచాడు. ఆ టైంలో పిలవడం నాకు కాస్త విచిత్రంగా అనిపించినా అవకాశం కోసం తప్పక వెళ్లాల్సి వచ్చింది. అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీ పడక తప్పదు, లేదంటే నీకు ఫ్యూచర్ ఉండదని అనంతరం కో ఆర్డినేటర్ బెదిరించాడు. దాంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించాను’’ అని వివరించాడు.
‘‘ఆ టైంలో అతను నాకు చాలా దగ్గరగా వస్తూ మాట్లాడడం మొదలు పెట్టాడు. వెంటనే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి బయటకు వచ్చేశా’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని షేర్ చేసుకున్న సిద్ధాంత్.. తర్వాత తన సినిమా అవకాశాలను తను దెబ్బతీస్తాడేమోనని భయపడినట్లు వెల్లడించాడు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్లో అతనే తనను ప్రశంసించాడని పేర్కొన్నాడు.